Ganesh Chaturthi 2024 | మరికొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా గణనాథుడి వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఊరు, వాడ పందిర్లు వేసి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు పిల్లలు, పెద్దలు సకల ఏర్పాట్లు చేశారు.
‘ భాద్రపద శుద్ధ చవితి ‘ రోజున వినాయక చవితి ని జరుపుకుంటారు. కానీ ఈసారి సెప్టెంబర్ 6న మరియు 7న రెండు రోజుల పాటు చవితి తిథి ఉందని పండితులు చెబుతున్నారు.
అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం శనివారం రోజున వినాయక చవితి నిర్వహించుకోవలని చెబుతున్నారు. శనివారం ఉదయం 11.03 గంటల నుండి 1.30 గంటల మధ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
అలాగే సాయంత్రం 6.22 గంటల నుండి 7.30 గంటల మధ్య వరసిద్ధి వినాయక వ్రత కల్పము చేసుకోవచ్చని చెబుతున్నారు.
మరోవైపు చవితి నాడు చంద్రున్ని చూడకూడదని పెద్దలు చెబుతారు. సెప్టెంబర్ 6న రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు, సెప్టెంబర్ 7న శనివారం రాత్రి 8 గంటల 45 నిమిషాల వరకు చంద్రున్ని చూస్తే అశుభం అని వేద పండితులు పేర్కొన్నారు.