Ys Sharmila On Kutami Govt. | విష జ్వరాలు రాష్టాన్ని వణికిస్తుంటే కూటమి ప్రభుత్వానికి కనీసం సూది గుచ్చినట్లైనా లేదని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( Ys Sharmila ).
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్ గా మారితే.. వైద్యారోగ్య శాఖ ఇంకా నిద్ర మత్తు వీడలేదని మండిపడ్డారు.
“పల్లెలు మంచం పట్టాయి. బాధితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న దీన దుస్థితి, ఓపి ఫుల్..వైద్యం నిల్..అన్నట్లు రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఉందని” నిలదీశారు.
మన్యంలో ఇంటికొకరు మంచాన పడితే.. జ్వరాలను అరికట్టడంపై ఇంతవరకు కార్యాచరణ లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. విష జ్వరాల కాటుకు ప్రజలు బలి కాకముందే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.










