Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను అవమానించారు”: వైసీపీ

“పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను అవమానించారు”: వైసీపీ

ysrcp vs pawan

YCP Slams Pawan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై విమర్శలు గుప్పించింది అధికార వైసీపీ (YCP). ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక చేతిలో కూటమి పార్టీల జెండాలు మరో చేతిలో జాతీయ జెండా (National Flag) పట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ స్పందించింది.

“లక్షల పుస్తకాలు చదివానంటావ్.. రోజూ నీతులు చెప్తావ్… ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్?
ప్రచారంలో జాతీయ జెండాను ప్రదర్శించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా?
సిగ్గులేకుండా ఓ చేత్తో మూడు పార్టీల జెండాలను పట్టుకుని.. మరో చేత్తో జాతీయ జెండాని పట్టుకుని అగౌరపరుస్తావా?
దేశాన్ని అవమానించే నీలాంటి వాడు ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా అనర్హుడు!” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది వైసీపీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions