Friday 22nd November 2024
12:07:03 PM
Home > Uncategorized > ఒక్క ఓటు కోసం..18 కి.మీ. దట్టమైన అడవిలో ట్రెక్కింగ్!

ఒక్క ఓటు కోసం..18 కి.మీ. దట్టమైన అడవిలో ట్రెక్కింగ్!

Forest trek

Polling Officials Forest Trek | ఒక్క ఓటు కూడా ఎంత విలువైందో తెలియజేసే ఘటన ఇది. ఒకే ఒక్క ఓటు వేయించడం కోసం ఎన్నికల అధికారులు ఏకంగా 18 కి. మీ. దట్టమైన అడవిలో ప్రయాణించారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా ఎడమలక్కుడి గ్రామంలో నివసిస్తున్నారు 92 ఏళ్ల శివలింగం.

వృద్ధాప్యం, ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి నుండి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తును ఆమోదించిన ఎన్నికల సంఘం తొమ్మిది మందితో కూడిన అధికారుల బృందాన్ని నియమించింది.

దీంతో బుధవారం ఆ అధికారులు శివలింగంతో ఓటు వేయించడం కోసం దట్టమైన అడవి లో, మన్య మృగాలు మధ్య సుమారు 18 కి.మీ. ట్రెక్కింగ్ చేసి శివలింగం ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయనతో ఓటు వేయించారు. ఓటు వేసిన అనంతరం శివలింగం కన్నీటి పర్యంతం అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions