Friday 22nd November 2024
12:07:03 PM
Home > తాజా > అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు.. సీఎం ఆదేశం!

అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు.. సీఎం ఆదేశం!

lasya nanditha

MLA Lasya Nanditha Last Rites | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nandhitha) అకాలమరణంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. నందిత తండ్రి సాయన్న(Sayanna)తో తనకు సన్నిహిత సంబంధం ఉండేదని సీఎం గుర్తు చేసుకున్నారు.

ఆయన గత ఏడాది ఇదే నెలలో మరణించండం, తిరిగి ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరమన్నారు.

నందిత కుటుంబానికి సీఎం రేవంత్ (CM Revanth Reddy) తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కాగా, ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లాస్య నందిత మృతదేహానికి గాంధీ దవాఖానలో పోస్టుమార్టం పూర్తిచేశారు.

అనంతరం కార్ఖానాలోని నివాసానికి ఆమె పార్ధివదేహాన్ని తరలించారు. ఈస్ట్‌ మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

You may also like
lasya nanditha
లాస్యను వెంటాడిన మృత్యువు.. రెండు ప్రమాదాల నుంచి బయటపడి..!
brs mla lasya nanditha
BRS MLA లాస్య నందిత మృతి.. తండ్రి మరణించిన ఏడాదికే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions