Thursday 13th August 2026
12:07:03 PM
Home > తాజా > సీఎం రేవంత్ ని కలిసిన బీఆరెస్ నేత.. కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం!

సీఎం రేవంత్ ని కలిసిన బీఆరెస్ నేత.. కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం!

Theegala meets cm

Teegala Krishna Reddy Meets CM | మహేశ్వరం (Maheswaram) మాజీ ఎమ్మెల్యే, బీఆరెస్ (BRS) నేత తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

డా. బీఆరెస్ అంబేద్కర్ సచివాలయంలో తీగల సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

తీగల కృష్ణారెడ్డి గతంలో టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్‌గా పని చేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.

కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి (Sabita Indrareddy) చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆమె బీఆరెస్ లో చేరడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తీగలకు బీఆరెస్ టికెట్ దక్కలేదు.

దీంతో ఎన్నికలకు ముందే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కానీ, అధిష్టానం బుజ్జగించడంతో బీఆరెస్ లోనే కొనసాగారు.

తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో తీగల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions