Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ఆదేశాల మేరకే ఏకగ్రీవానికి ఆమోదం..స్పీకర్ ఎంపికపై కేటీఆర్ వ్యాఖ్యలు!

కేసీఆర్ ఆదేశాల మేరకే ఏకగ్రీవానికి ఆమోదం..స్పీకర్ ఎంపికపై కేటీఆర్ వ్యాఖ్యలు!

Gaddam Prasad Kumar

Telangana New Speaker | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరియు ఇతర పార్టీ సభ్యులంతా కలిసి ఆయన్ను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..తొలి రోజే సభ మంచి సంప్రదాయాలతో మొదలు కావడం శుభ పరిణామం అని, భవిష్యత్ లో ఇలాంటి సంప్రదాయాలే కొనసాగాలని ఆకాంక్షించారు.

అలాగే స్పీకర్ ఎంపిక కోసం ప్రత్యేక్ష మద్దతు తెలిపిన బీఆరెస్, ఎంఐఎం, సీపీఐ మరియు పరోక్ష మద్దతు తెలిపిన బీజేపీ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

బీఆరెస్ సుప్రీమో, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇచ్చినట్లు  స్పష్టం చేశారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.

ఎంపిటిసి నుండి ఈరోజు స్పీకర్ గా ఎదిగిన గడ్డం ప్రసాద్ కుమార్ జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ఆయన.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions