Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇలా చేసింది: కిషన్ రెడ్డి

ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే కాంగ్రెస్ ఇలా చేసింది: కిషన్ రెడ్డి

BJP Kishan REddy

BJP Kishan Reddy Pressmeet | తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. శనివారం నాడు పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే లతో భేటీ అయ్యి, అనంతరం భాగ్యలక్ష్మి ఆలయంలో దర్శనం చేసుకున్నారు కిషన్ రెడ్డి.

అనంతరం నాంపల్లి పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మాట్లాడుతూ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల లోపాయకారి ఒప్పందం మూలంగానే అక్బరుద్దీన్ ఓవైసీ ని ప్రొటెం స్పీకర్ గా నియమించారని ఆరోపించారు.

బొటాబోటి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ, తుమ్మినా, దగ్గినా ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందనే భయంతోనే ఎంఐఎం తో చేసుకున్న ఒప్పందం మేరకే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారని మండిపడ్డారు.

బీజేపీ ఎమ్మెల్యే లు ఎవరూ అక్బరుద్దీన్ అధ్యక్షతన ప్రమాణం చేయరని, స్పీకర్ ఎంపిక తర్వాతనే ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. ఎన్నికల ప్రచారం లో బీజేపీ, ఎంఐఎం ఒకటేనని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని ధ్వజమెత్తారు ఈ నేత.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions