Monday 23rd March 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఇందూరు ప్రజల ఆశీర్వాదం తోనే గెలుపొందడం జరిగిందని

ఇందూరు ప్రజల ఆశీర్వాదం తోనే గెలుపొందడం జరిగిందని

The victory was achieved with the blessings of the people of Indore

` -నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ గుప్తా
ఇందూరు ప్రజల ఆశీర్వాదం తోనే గెలుపొందడం జరిగిందని, నా గెలుపుకు సాయ శక్తుల కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, మీడియా మిత్రులకు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ధన్యవాదములు తెలిపారు. సోమవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి లక్ష్యంగా ఒక సేవకుడిలా పని చేస్తానని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడ్తున్న ప్రతి పథకాన్ని నగరంలో ఇంటి ఇంటికి తీసుకెళతామని అన్నారు. నగరంలో 6 నెలల కోసారి జాబ్‌ మేళా నిర్వహిస్తామని, నగరం లోని ఇండ్లు లేని అర్హులైన నిరుపేదలకు వచ్చేలా కృషి చేస్తామని తెలియచేశారు. అర్బన్‌ నియోజకవర్గాన్ని అద్భుతమైనా నగరంగా తీర్చిదిద్దుతామని, కార్యకర్తల కు ఎల్లవేళలా అండగా ఉంటాను అని పేర్కొన్నారు సమాజ సేవలో నిరంతరం నా ట్రస్ట్‌ ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు ప్రజల అందరు అభివృద్ధి కి సహకరించాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రజలతో మామేకై మీకు అండగా ఉంటాను అన్నారు . ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నరసయ్య శాలువా, బుకే తో దన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్తాను సన్మానించారు . ఈ కార్యక్రమం లో అసంబ్లీ కన్వీనర్‌ పంచరెడ్డి లింగం ,జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, పడుగేల వెంకటేష్‌, కార్పొరేటర్లు మండల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions