Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తెలంగాణ > హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర దళిత కాంగ్రెస్‌ ఛైర్మన్‌

హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర దళిత కాంగ్రెస్‌ ఛైర్మన్‌

The state Dalit Congress chairman expressed joy

హైదరాబాద్ : ఆత్మ బలిదానాలతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణా దొరల గడీల నుండి విడిపించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర దళిత కాంగ్రెస్‌ ఛైర్మన్‌ నాగరిగారి ప్రీతమ్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలను మేల్కొల్పిన కాంగ్రెస్‌ జాతీయ నాయకులు ఎం.పి రాహుల్‌ గాంధీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించారని నాగరిగారి ప్రీతమ్‌ కొనియాడారు. అదేవిధంగా కెసిఆర్‌ కుటుంబ పాలనపై అలుపెరుగని పోరాటం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క వంటి నాయకులు తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల కుటుంబ పాలన నుండి నిజమైన విముక్తి అందజేసారని ప్రశంసలు వర్షం కురిపించారు. సిఎం నివాసం ప్రగతి భవన్‌ పేరును డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రజా భవన్‌ గా పేరు మారుస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ప్రకటించడం పట్ల యావత్‌ రాష్ట్ర ప్రజలు, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అభిమానుల తరఫున తెలంగాణ దళిత కాంగ్రెస్‌ ఛైర్మన్‌ నాగరిగారి ప్రీతమ్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో అధికారం చేజిక్కించుకొని నియంత పోకడలు పోతే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions