Thursday 21st November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఇండియా.. పాకిస్తాన్.. ఒక పబ్జీ ప్రేమకథ!

ఇండియా.. పాకిస్తాన్.. ఒక పబ్జీ ప్రేమకథ!

Pak Woman Loves Indian | పాకిస్తాన్ మరియు ఇండియా అనగానే అందరికి క్రికెట్ మ్యాచ్ గుర్తుకు వస్తుంది. కానీ గత కొద్ది రోజులుగా పాకిస్తాన్, ఇండియా అనగానే ఒక ప్రేమకథ గుర్తుకువస్తుంది.

దేశాంతరలు దాటి ఒక్కటైన ఈ ప్రేమకథ రెండు దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.

సీమా గులాం హైదర్ (27) పాకిస్తాన్ నుండి నేపాల్ మీదుగా ఇండియా లోకి ప్రవేశింది. అది కూడ వీసా లేకుండా, కానీ ఆమె వచ్చింది తన ప్రియుడి కోసం అని తెలిసినా తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

సీమా గులాం పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన యువతి. వివాహం తర్వాత కరాచీలో నివాసం ఉంటున్నది. ఆమెకు నలుగురు సంతానం, ఆమె భర్త సౌదీలో ఉద్యోగం చేస్తుంటాడు.

మరోవైపు సచిన్ మీనా గ్రేటర్ నోయిడాకు చెందిన వ్యక్తి. వీరిద్దరి ప్రేమ ఆన్లైన్ గేమింగ్ ఆప్ పబ్జీ లో మొదలయ్యింది.

2019 నుండి వీరిద్దరూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. తర్వాత కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

వెంటనే సీమా గులాం పాకిస్తాన్ లో తన భూమిని అమ్మి వచ్చిన డబ్బుతో నేపాల్ టూరిస్ట్ వీసా తీసుకుంది. పాకిస్తాన్ నుండి తన నలుగురి పిల్లలతో నేపాల్ వచ్చింది.

ఆ నలుగురు పిల్లలు అందరూ కూడా ఏడూ సంవత్సరాల లోపు వారే.

నేపాల్ లోని ఖాట్మండు లో ఒక ఆలయంలో వీరిద్దరూ పెళ్లిచేసుకున్నారు. తర్వాత ఇండియా కు వచ్చి గ్రేటర్ నోయిడాలో అద్దె గదిలో నివసిస్తున్నారు.

పొరుగువారు వీరిద్దరి వివాహం యొక్క చట్టబద్ధత గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో సరిహద్దు దాటిన జంటను జులై 4న పోలీసులు అరెస్టు చేశారు.

అక్రమ వలసదారునికి ఆశ్రయం కల్పించినందుకు సచిన్ మీనా తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు.తర్వాత నోయిడాలోని లస్కర్ జైలుకు తరలించారు.

నోయిడా కోర్ట్ శనివారం రోజున వీరికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

కోర్ట్ తీర్పు వచ్చేంతవరకు సీమా హైదర్ ఎక్కడికి వెళ్లకూడదని అలాగే వీరిద్దరూ కోర్టులో తరచుగా హాజరు కావాలని పేర్కొంది.

లాయర్ హేమంత్ కృష్ణ పరాషార్ ఇండియా-పాకిస్తాన్ ప్రేమజంట కేసును వాదిస్తున్నారు.

నేపాల్‌లోని ఖాట్మండులో తనకు, సచిన్‌కు వివాహం జరిగిందని సీమా నాకు లిఖితపూర్వకంగా చెప్పింది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశాను.

సీమ మొదట పాకిస్థాన్ నుంచి నేపాల్ వెళ్లి ఆ తర్వాత ఇండియాకు వచ్చిందని కూడా వాదించాను.

నేపాల్ నుండి భారతదేశానికి వచ్చే వారు పాస్‌పోర్ట్ లేదా వీసా కలిగి ఉండవలసిన అవసరం లేదని లాయర్ మీడియాకు తెలిపారు.

తనకు తిరిగి పాకిస్థాన్ కు వెళ్లాలని లేదని, ఇక్కడే నాకు రక్షణ ఉంటుందని సీమా హైదర్ పేర్కొంది.
తన భర్త ఫోన్ లొనే విడాకులు ఇచ్చాడని సీమా హైదర్ తెలిపారు.

సీమా హైదర్ పెళ్లి తర్వాత సచిన్ మీనా యొక్క మతం మరియు సంస్కృతిని నా సొంతంగా అంగీకరించారు మరియు సచిన్‌ను ‘బాబా’ [తండ్రి] అని పిలిచే నా నలుగురు పిల్లల పేర్లను మార్చారు.

“సచిన్ తల్లితండ్రులు కూడా నన్ను అంగీకరించారు. నేను వారి అన్ని సాంస్కృతిక పద్ధతులను స్వీకరించాను” అని సీమా హైదర్ చెప్పారు.

నేపాల్ రాజధాని ఖాట్మండులోని పూజ్యమైన హిందూ దేవాలయమైన పశుపతినాథ్ ఆలయంలో తాము వివాహం చేసుకున్నామని దంపతులు కోర్టుకు తెలిపారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions