Sanjay Raut Slams KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు.
సోమవారం 12 మంది మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర నాయకులతో సుమారు 600 వాహనాలతో భారీ బల ప్రదర్శన చేస్తూ మహారాష్ట్ర (Maharashtra) చేరుకున్నారు.
మహారాష్ట్ర చేరుకున్నాక మధ్య మధ్యలో మంత్రులు ఆగి దాబాల వద్ద చాయ్ తాగుతూ తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురుంచి అక్కడి వారికి వివరిస్తూ ముందుకు పోయారు.
మంగళవారం ఉదయం పండరీపూర్ లోని రుక్మిణీ సమేత విఠలేశ్వురుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
అక్కడి నుండి సర్కోలి గ్రామం చేరుకొని అక్కడ ఎన్సీపీ (NCP) షోలపూర్ జిల్లా నేత అయిన భగీరథ బల్కే (Bhagirath Bhalke)తో పాటు ఇతరులు పార్టీ లో చేరనున్నారు.
ఇలా కేసీఆర్ మహారాష్ట్ర పైన కేంద్రంగా జాతీయ రాజకీయాల్లో స్పీడ్ పెంచారు. సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లి సభలు పెడుతున్నారు.
కేసీఆర్ పై పర్యటనపై శివసేన కామెంట్స్..
కేసీఆర్ పర్యటనపై శివసేన పార్టీ (Sivasena) (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఘాటుగా స్పందించింది.
ఆ పార్టీలో కీలక వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ కేసీఆర్ ని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశం లో జర్నలిస్ట్ లు కేసీఆర్ గురుంచి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన మాట్లాడారు.
కేసీఆర్ పర్యటన వల్ల, వారి పార్టీ వల్ల మహారాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
ఏదైనా ప్రభావం ఉంటే అది కేవలం తెలంగాణలో చూపుతుందని వ్యాఖ్యానించారు.
నాటకాలు చేస్తే తెలంగాణలో ఓడిపోతారు..
కేసీఆర్ ఇలాంటి నాటకాలు చేస్తే మహారాష్ట్రలో విజయంఏమో కానీ, తెలంగాణలో మాత్రం కచ్చితంగా ఒడిపోతారని అని జ్యోసం చెప్పారు.
ఆ ఓటమి భయం తోనే కేసీఆర్ మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా మహారాష్ట్రలో కేసీఆర్ పెద్ద పెద్ద సభలు, పర్యటనలు చేస్తున్న సమయం లొనే ఢిల్లీలో ఆయన పార్టీ కి చెందిన మాజీ మంత్రులు, ఎంపీ లో కాంగ్రెస్ లో చేరుతున్నారని గుర్తుచేశారు.
ఇది కేవలం కాంగ్రెస్ మరియు బీఆరెస్ (BRS Party) పోటీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) తో పోరాడకుండా మహారాష్ట్ర లోకి వస్తున్నారు.
ఇది బీజేపీ (BJP)కి లాభం చేకూర్చటానికే అని రౌత్ తెలిపారు.
“బీజేపీ వ్యూహంలో భాగంగానే హైద్రాబాద్ నుండి ఎంఐఎం (MIM Party) మహారాష్ట్రలో రాజకీయాలు చేస్తుంది.
ఇప్పుడు అదే హైద్రాబాద్ నుండి కేసీఆర్ కూడా రావడం చూస్తుంటే ఇది కూడా బీజేపీ వ్యూహం అనిపిస్తుంది. కేసీఆర్ గారు బీజేపీ కి బీ-టీంలా వ్యవహరిస్తున్నారు” అని ఆరోపించారు..
రెండుసార్లు సీఎంగా, కేంద్ర మంత్రి గా తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఇలా బీజేపీ ముందు ఎందుకు మోకరిల్లుతున్నారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ కేవలం డబ్బులతో పబ్లిసిటీ చేసుకొని, కొందరి నాయకులని కొనొచ్చు కానీ మహారాష్ట్ర లో ప్రజలని కొనలేరని వ్యాఖ్యానించారు.
విఠల్ రుక్మిణి ఆలయంలో పూజలు చెయ్యటానికి కేసీఆర్ వచ్చారు.. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
బీఆరెస్ పార్టీ పెట్టి కేసీఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టిన తర్వాత ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపరో తెలీదు.. కానీ ఆ రాష్ట్ర నాయకులు మాత్రం కేసీఆర్ ని బీజేపీ బి-టీం అని తరచు విమర్శలు గుప్పించడం గమనార్హం.