Greece Train Accident | ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకోన్న ఘటనలో దాదాపు 32 మంది సజీవ దహనం అయ్యారు. మరో 85 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన గ్రీస్ లో చోటు చేసుకుంది.
గ్రీస్ దేశంలోని నాలుగో అతిపెద్ద నగరమైన లారిస్సా సమీపంలోని ఎవాంజెలిస్మోస్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఏథెన్స్ నుండి ఉత్తర నగరమైన థెస్సలోనికీకి ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు మరియు సరుకు రవాణా రైలు ఢీకొన్నాయని ఆ దేశ జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న కార్గో రైలును ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది. ప్రమాద (Train Collision) తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి.
Read Also: అమెరికాలో జాంబీ డ్రగ్ కలవరం.. శరీరంపై పుండ్లతో అవయవాల తొలగింపు!
మరికొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్క కు పడిపోయాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే స్థానిక భద్రతాసిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది ప్రయాణికులున్నట్ల సమాచారం. ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగిన ముందు బోగీల్లో 32 మంది సజీవదహనం అయ్యారు.
Also Read: బహిరంగ చర్చకు సిద్ధమా.. కేటీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్!
దాదాపు 85 మంది గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గ్రీక్ ఫైర్ సర్వీస్ తెలిపింది. రైళ్ల ప్రమాదానికి సంబంధించిన ఘటన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.