TS High Court | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చేపట్టదలచిన మార్చ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ మార్చ్ నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని షరతులు విధించింది. ఈ ర్యాలీలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు సూచించింది.
ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీ లో పాల్గొనాలన్న హైకోర్టు ఆదేశించింది. మసీదుకు 300 మీటర్లు దూరంలో ర్యాలీ నిర్వహించు కోవచ్చని న్యాయస్థానం పేర్కొంది.
Read Also: డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ!
ఆర్ఎస్ఎస్ మార్చ్ సందర్భంగా మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను TS High Court ఆదేశిచింది.
ర్యాలీ లో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని ధర్మాసనం హెచ్చరించింది.
భైంసాలో ఆర్ఎస్ఎస్ చేపట్టదలిచిన ర్యాలీ కి పోలీసులు ఇప్పటికే అనుమతి నిరాకరించారు. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా అనుమతి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదిక ను ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు కు సమర్పించారు.
రెండు సంవత్సరాలు క్రితం బైంసా లో జరిగిన మత ఘర్షణలు వలన ప్రాణ నష్టం జరిగిందని గుర్తు చేశారు.
భైంసా అత్యంత సున్నిత, సమస్యాత్మకమైన ప్రాంతం అని ప్రభుత్వ తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ఒక్క స్లోగన్ తో మత విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని తెలిపారు.
CM KCR జన్మదినం సందర్భంగా కేబీకే హాస్పిటల్ ఆధ్వర్యంలో అన్నదానం
అయితే గతంలో టిప్పు సుల్తాన్ జయంతి ర్యాలీ కు పోలీసులు అనుమతి ఇచ్చారని ఆరెసెస్ తరఫున పిటిషనర్ తన వాదనలు వినిపించారు. బైంసా భారత దేశంలోనే ఉందని, వెలసిన ప్రాంతం కాదని వాదనలు వినిపించారు.
ఎట్టకేలకు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు చివరికి ఆర్ఎస్ఎస్ మార్చ్ కి షరతులతో కూడిన అనుమతి జారీ చేసింది.