Saturday 17th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నేపాల్ వరదల్లో నిలిచిన 40 ఏళ్ల ‘మిరాకిల్ హౌస్’!

నేపాల్ వరదల్లో నిలిచిన 40 ఏళ్ల ‘మిరాకిల్ హౌస్’!

  • ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం భావోద్వేగ కథనం!

Nepal Floods Miracle House Survival Story నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో ప్రవహించే త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చి, పరిసర ప్రాంతాల్లోని వాహనాలు, భవనాలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఆ భీకర వరదల ధాటికి చుట్టుపక్కల ఉన్నవన్నీ కొట్టుకుపోయినా, 40 ఏళ్ల పాతబడిన ఒక పచ్చని రంగు ఇల్లు మాత్రం చెక్కుచెదరకుండా నిలబడి సోషల్ మీడియాలో ‘మిరాకిల్ హౌస్’ (అద్భుత ఇల్లు)గా వార్తల్లో నిలిచింది. ఈ దారుణ విపత్తు నుండి ప్రాణాలతో బయటపడ్డ ఆ ఇంటి యజమాని ప్రకాష్ మరియు ఆయన కుటుంబం, తాము ఎదుర్కొన్న నరకాన్ని ‘ది లాలన్‌తోప్’ (ది లాంటిప్‌) తో పంచుకున్నారు.

వరద ధాటికి నాలుగో అంతస్తు వరకు నీరు..

క్షణాల్లో పెరిగిన నీటి ఉధృతి: వరద హెచ్చరికల సమాచారం అందగానే దుకాణంలో ఉన్న ప్రకాష్ వెంటనే ఇంటికి పరుగెత్తి లోపల ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. అయితే బయటకు వచ్చేలోపే నీటి శక్తి ఆయన వాహనాన్ని బోల్తా కొట్టించింది.

నీటి మట్టం వేగంగా పెరగడంతో ఆరుగురు సభ్యుల కుటుంబం నాలుగో అంతస్తుకు చేరుకుంది. కానీ నీరు అక్కడికి కూడా చేరడంతో వారు భవనంలోని అతి ఎత్తైన ప్రదేశానికి (పై అంతస్తుకి) వెళ్లాల్సి వచ్చింది.”ఇది మా జీవితంలో చివరి క్షణం అని భావించాము. అందరం కలిసే ఉన్నాం, కానీ నా కొడుకు పాఠశాలకు వెళ్లి ఇంట్లో లేడు. మనకు ఏదైనా జరిగితే వాడికి ఏమవుతుందోననే ఆలోచే నన్ను తీవ్రంగా కలచివేసింది” అని ప్రకాష్ గుర్తుచేసుకున్నారు.

‘మిరాకిల్ హౌస్’ ఎలా తట్టుకోగలిగింది?

చుట్టూ ఉన్న నిర్మాణాలు కొట్టుకుపోయినా ఈ 40 ఏళ్ల ఇల్లు ఎందుకు నిలబడిందో ప్రకాష్ వివరిస్తూ 40 ఏళ్ల క్రితం సిమెంట్ మరియు నిర్మాణ సామగ్రి నాణ్యత చాలా మెరుగ్గా ఉండేదని తెలిపారు. ఇల్లు నదికి దగ్గరగా ఉండటంతో భద్రత దృష్ట్యా పునాది కింద రెండు మూడు పొరల రోడ్డు మెటీరియల్‌ వేసి చాలా బలంగా నిర్మించామని, దానికే ఎక్కువ ఖర్చు చేశామని చెప్పారు. ఇల్లు నిలబడినప్పటికీ దిగువన ఉన్న గిడ్డంగి తీవ్రంగా దెబ్బతిందని, బైక్‌లు, స్కూటర్లతో సహా వాహనాలు, లోపలి వస్తువులు కొట్టుకుపోయాయని తెలిపారు.

పైప్, తాడు సాయంతో సాహసోపేత రెస్క్యూ..

గంట నుండి గంటన్నర పాటు కుటుంబం ఆ భవనంలో చిక్కుకుపోగా, నీటి మట్టం కొద్దిగా తగ్గడం ప్రారంభమైంది. ఆ సమయంలో సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి, భవనాల మధ్య పైపు మరియు తాడును ఉపయోగించి ఐదుగురు కుటుంబ సభ్యులతో పాటు ప్రకాష్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

You may also like
నేపాల్ వరద విపత్తులో అద్భుతం.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి బయటకి!
నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్!
నేపాల్ వరదలు: 626కు పెరిగిన మృతుల సంఖ్య, 2500 మంది గల్లంతు!
నారా లోకేశ్ పర్యవేక్షణ..ఏపీకి నేపాల్ లో చిక్కుకున్న వారు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions