YV Subba Reddy About Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆమె వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
తన ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయాన్ని వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డే తనతో చెప్పారని, ఈ మేరకు ట్యాప్ అయిన ఒక ఫోన్ సంభాషణను సైతం వినిపించారని పేర్కొన్నారు.
కాగా షర్మిల చేసిన ఆరోపణలపై తాజగా వైవి సుబ్బారెడ్డి స్పందించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఆరోపణల్ని కొట్టిపారేశారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండగా,షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు.
అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసలు కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్‌చేసిందా?లేదా? అన్నది తనకు తెలియదన్నారు. టీడీపీకి సంబంధించిన వాటిలో తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.