Tuesday 29th April 2025
12:07:03 PM
Home > తాజా > ‘టీడీపీ నీకు ఎన్ని వేలకోట్ల కట్నం ఇచ్చింది’ రేవంత్ పై వైసీపీ ట్వీట్..!

‘టీడీపీ నీకు ఎన్ని వేలకోట్ల కట్నం ఇచ్చింది’ రేవంత్ పై వైసీపీ ట్వీట్..!

Revanth reddy

YCP tweet On Revanth Reddy | తెలంగాణ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసింది ఏపీ లో అధికారంలో ఉన్న వైసీపీ.

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను చంద్రబాబు కు సహచరుడిని అని ఆయన వద్ద నిబద్ధతతో పని చేసానని తెలిపారు.

తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. అయినా పుట్టింట్లో ఉన్నత కాలం కూతురు తల్లి తండ్రుల పక్షాన ఉంటుంది,

కానీ అత్తారింటికి వెళ్ళాక ఆ ఇంటి గౌరవాన్ని కాపాడడమే కొడాలి బాధ్యత అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రేవంత్.

కోడలిగా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడుతనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పై సంచలన ట్వీట్ చేసింది వైసీపీ.

“రేవంత్ ఇంతకూ కాంగ్రెస్ తో పెళ్ళి చేసినందుకు మీ పుట్టింటి టీడీపీ వాళ్ళు ఎన్ని వేలకోట్లు కట్నం ఇచ్చారు. ఆ కట్నంతోనే పీసీసీ పదవి కొన్నావా? భవిష్యత్తులో అత్తగారింట్లో గొడవ వస్తే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతావా?

పుట్టింటి గౌరవం కాపాడే తాపత్రయంతో మళ్ళీ టీడీపీలో చేరిపోతావా? పుట్టినిల్లా? మెట్టినిల్లా..? ఏది ప్రాధాన్యం అంటే ఎలా తేల్చుకుంటారు?

ఈ అంశాలన్నిటి మీదా స్పష్టత ఇస్తే నిన్ను ఎక్కడ ఉంచాలన్నది అత్తింటి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుంది కదా!” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది వైసీపీ.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
amith shah
రాష్ట్రాల సీఎంలకు హోం మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు!
‘MMTS అత్యాచారయత్నం కేసు..యువతి మాటలకు షాకయిన పోలీసులు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions