Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > బహిరంగ చర్చకు సిద్ధమా.. కేటీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్!

బహిరంగ చర్చకు సిద్ధమా.. కేటీఆర్ కు వైఎస్ షర్మిల సవాల్!

YS Sharmila Challenge | తెలంగాణలో పెడింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశామనీ, నీళ్ల కష్టాలు లేవంటూ కేటీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కి సవాల్ విసిరారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

YS Sharmila Challenge ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా (Kaleswaram Project) రీ డిజైన్ చేసి రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు.

అంతేకానీ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఏ ప్రాజెక్టును సైతం పట్టించుకోలేదు.

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే విధంగా 33 ప్రాజెక్టులకు  వైయస్ఆర్ శంకుస్థాపనలు చేశారు.

Read Also: భైంసా ఆర్ఎస్ఎస్ మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులివే!

2016-17 నాటికే ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసే విధంగా పనులు సైతం వేగంగా జరిగాయి. అలీసాగర్, గుత్పా, గడ్డెన్న సుద్దవాగు లాంటి ప్రాజెక్టులు 2007 వరకు పూర్తి చేశారు.

దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు 70 శాతం, మిగిలిన ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తి కావొచ్చాయి.

అయితే 2009లో వైయస్ఆర్ (YSR) మరణానంతరం అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) గానీ.. 2014లో అధికారంలోకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గాని పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకున్నది లేదు.

2015లో అసెంబ్లీ వేదికగా పెద్ద దొర కేసీఆర్ (KCR) చెప్పిన మాట.. కేవలం రూ.8500 కోట్లు ఖర్చు చేస్తే 16 పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవచ్చు, 35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని వేదాలు వల్లించారు.

అయితే 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు అవసరం అయిన నిధులు విడుదల చేయకుండా జలయజ్ఞం ప్రాజెక్టులపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపెట్టారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తెలంగాణను ఎడారిగా మార్చింది పోయి కోటి ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని నీతులు చెప్తున్నారు. పెద్ద దొర కేసీఆర్, చిన్నదొర కేటీఆర్ కు ఒక సవాల్ విసురుతున్నాం.

తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం అని మీరు అంటున్నారు. పూర్తి కాలేదని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మేం అంటున్నాం. ప్రజాక్షేత్రంలో బహిరంగ చర్చకు తండ్రి కొడుకులు రాగలరా?

Read Also: డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు ఎమ్మెల్సీ కవిత లేఖ!

తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు

– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు తట్టెడు మట్టి కూడ మోయలేదు

– నల్గొండ జిల్లాలో SLBC,డిండి,బ్రాహ్మణ వెల్లేముల,ఉదయసముద్రం,అడవిదేవుల పల్లి,సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (8 లిఫ్టులు) పూర్తి కాలేదు

– పాలమూరు జిల్లాలో, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి,భీమా ఫేజ్ 1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, భూత్పూరు ప్రాజెక్టులు పూర్తి కాలేదు

– ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కొరాట, జగన్నాథపురం, కొమురంభీం, వార్థా, కుఫ్టి, చెన్నూరు లిఫ్ట్, గూడెం లిఫ్ట్, గొల్లవాగు, నీల్వాయి ప్రాజెక్టులకు అతీగతీ లేదు

– నిజామాబాద్ జిల్లాలో కాళేశ్వరం ప్యాకేజీ 20,21,22 , లెండి ప్రాజెక్టులు పెండింగ్

– కరీంనగర్ జిల్లాలో ప్యాకేజి 9,సూరమ్మ చెరువు ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టులు పెండింగ్

– వరంగల్ జిల్లాలో దేవాదుల, చిన్న కాళేశ్వరం, గుండవాగు, ఆకేరువాగు, పాలెంవాగు, ఆకేరువాగు, పాలకుర్తి, చెన్నూరు, మోడి కుంట ప్రాజెక్టులు పెండింగ్

– మెదక్ జిల్లాలో సింగూరు కాలువల ఆధునీకరణ, ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పెండింగ్

ఓట్ల కోసం సాగు నీరు ఇచ్చామని అబద్దపు మాటలతో  రాజకీయం చేసే అయ్యా కొడుకులు ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద వివక్ష ఎందుకు చూపెట్టారో బహిరంగ చర్చకు రావాలి.

మీ కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కట్టిన మూడేళ్లకే మునిగిపోయింది.

కాళేశ్వరం ద్వారా 57 వేల ఎకరాలకే సాగు నీరు ఇస్తే.. ఆ ప్రాజెక్టులో నడిచే మోటర్లకు కట్టే కరెంట్ బిల్లుల మందం కేటాయించినా ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తయ్యేవి.

దాదాపు 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా తండ్రీకొడుకులు చేసిన మోసం అంతా ఇంతా కాదు.

You may also like
chamala kiran kumar reddy
“నీది రా కుట్ర…” కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్!
పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
ktr comments
‘ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర ‘: కేటీఆర్
ys vijayamma
YS Family ఆస్తుల వివాదం.. విజయమ్మ సంచలన లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions