Wednesday 14th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కొత్త సంవత్సరం రోజే కుమారుడి పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన షర్మిల!

కొత్త సంవత్సరం రోజే కుమారుడి పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన షర్మిల!

YS Sharmila son marraige

YS Sharmila Son Marriage | వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కుమారుడు రాజారెడ్డి (Raja Reddy) ప్రేమ వివాహం చేసుకోబోతున్నారంటూ ఇటీవల ఓ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి అట్లూరి ప్రియను (Priya Atluri) ఆయన మనువాడుతారంటూ ప్రధాన మీడియాలో కూడా వార్తాకథనాలు ప్రసారం అయ్యాయి. అంతే కాకుండా షర్మిల తల్లి విజయమ్మ ప్రియకు చీర పెట్టిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వివాహం ఖాయమననే సంకేతాలు వెలువడ్డాయి.

తాజాగా వైఎస్ షర్మిల కూడా కొత్త సంవత్సరంసందర్బంగా ఓ శుభవార్త చెప్పారు. తన కుమారుడి వివాహానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రాజా రెడ్డి ప్రియల వివాహం ఖాయమని స్పష్టం చేశారు. జనవరి 18 వీరి నిశ్చితార్థం ఉంటుందని ట్వీట్ చేశారు షర్మిల.

ఇక ఫిబ్రవరి 17న పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు YS రాజారెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

రేపు (జనవరి 2) మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు.

You may also like
sharmila
ఈసారైనా కట్టేనా.. లేక మళ్లీ మట్టేనా: ప్రధాని పర్యటనపై షర్మిల కామెంట్స్!
ys vijayamma
YS Family ఆస్తుల వివాదం.. విజయమ్మ సంచలన లేఖ!
congress party
కాంగ్రెస్ నుండి పోటీకి భారీగా అప్లికేషన్లు!
పదవుల పంపకాల్లో అన్యాయం చేశారా: షర్మిలకు సజ్జల కౌంటర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions