Wife Accepts Second Marriage to Husband | మహబూబా బాద్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ భార్య తన భార్తకు దగ్గరుండి మరీ రెండో పెళ్లి (Second Marriage) చేయించింది. అయితే దీని వెనక ఓ కారణముంది.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాకు చెందిన సురేష్, సరితలకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మరోవైపు సురేశ్ మేనమామకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో చిన్న కూతురు సంధ్య ఓ మానసిక దివ్యాంగురాలు.
సంధ్యకు చిన్నప్పటి నుంచి సురేష్ అంటే ఇష్టం. పెళ్లి చేసుకుంటే సురేష్‌నే చేసుకుంటానని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు చివరకు ఈ విషయాన్ని సురేష్ దంపతుల వద్ద ప్రస్తావించారు.
అయితే సంధ్యను వివాహం చేసుకునేందుకు సురేష్ భార్య సరిత అంగీకరించింది. అంతే కాకుండా తానే పెళ్లి పెద్దగా వ్యవహరించి, దగ్గరుండి వివాహం జరిపించింది. సరిత తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. ఇక నుంచి సంధ్య బాధ్యత తామే చూసుకుంటామని సరిత తెలిపింది.