Tuesday 13th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం

We will extend full cooperation to the Congress government

హైదరాబాద్‌:నూత నంగా ఏర్పడనున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం అభినందనలు తెలిపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం హర్షం వ్యక్తంచేస్తున్నట్లు సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పది లక్షల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం కలిసి పనిచేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్యోగులుగా ప్రభుత్వం తో కలిసి సమన్వయం చేసుకుని ముందుకెళతామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు నూతన ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పలు అనుకూల నిర్ణయాలను ప్రకటించిందని, ఆయా మ్యానిఫెస్టో అమలు కోసం, ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. నూతన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయటంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ముందుంటామని జగదీ శ్వర్‌తో పాటు టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్‌ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనా రాయణ గౌడ్‌, కోశాధికారి రామినేని శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌, హైదరా బాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుస్సేని తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు…

You may also like
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’
ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions