Wednesday 14th May 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వయనాడ్ ప్రమాదం..అప్రమత్తం చేయలేదు : అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం

వయనాడ్ ప్రమాదం..అప్రమత్తం చేయలేదు : అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించిన సీఎం

Wayanad Landslide News | కేరళ ( Kerala ) లోని వయనాడ్ ( Wayanad ) లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఈ ప్రమాదం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్రం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

కొండచరియలు విరిగిపడడాని కంటే వారం రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించామని, అయినా కేరళ ప్రభుత్వం ప్రజల్ని తరలించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.

ఈ నేపథ్యంలో కేరళ సీఎం పినరయి విజయన్ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. తమకు ఎలాంటి అలెర్ట్ ( Alert ) జారీ చేయలేదన్నారు. విపత్తుకు ముందు వయనాడ్ కు కేంద్రం రెడ్ అలెర్ట్ ( Red Alert ) జారీ చేయలేదని సీఎం చెప్పారు.

హెచ్చరికలు జారీ చేయడానికి ముందే కొండచరియలు విఐగిపడ్డాయని పేర్కొన్నారు. అయినా ఇది నిందలు వేసుకునే సమయం కాదని అమిత్ షా కు సీఎం విజయన్ సూచించారు.

You may also like
asaduddin owaisi
పాకిస్తాన్ కు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్!
‘పాకిస్థాన్ అమ్మాయితో పెళ్లి ఖరారు..ఇంతలోనే’
‘జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడి’
‘జై శ్రీరామ్ నినాదం..తమిళనాడు గవర్నర్ పై విమర్శలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions