Amit Shah On Wayanad Landslides | కేరళ ( Kerala ) లోని వయనాడ్ ( Wayanad ) లో జరిగిన విషాదం యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటికే 180 మందికి పైగా మృతి చెందారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) స్పందించారు. వరదల ముప్పు గురుంచి జులై 23నే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాల గురుంచి ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందని, ప్రపంచంలోనే ఇటువంటి సాంకేతికత ( Technology ) ఉన్న నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటని అమిత్ షా తెలిపారు.
ఈ సాంకేతికత ఆధారంగా వారం రోజుల ముందే కేరళను అప్రమత్తం చేసినట్లు, తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ ( NDRF ) బృందాలను రాష్ట్రానికి పంపినట్లు హోం మంత్రి చెప్పారు.
కానీ కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల్ని సకాలంలో తరలించలేదని ఆరోపించారు. ఈ విపత్తును ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని మోదీ ( Pm Modi ) బాసటగా ఉన్నారని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో అమిత్ షా ప్రకటించారు.