Virat Kohli Breaks Sachin Record| వరల్డ్ కప్ ( World Cup ) లో భాగంగా బుధవారం ఇండియా ( India ) మరియు న్యూజిలాండ్ ( New Zealand ) జట్ల మధ్య సెమి ఫైనల్ ( Semi Final ) మ్యాచ్ జరిగిన విషయం తెల్సిందే.
ఈ మ్యాచ్ ( Match ) లో 70 పరుగులతో ఘన విజయం సాధించింది భారత్. కాగా మ్యాచ్ సందర్భంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సరికొత్త రికార్డు సృష్టించారు. వన్డేల్లో అత్యధిక సెంచరీ ( Century ) చేసిన వ్యక్తిగా నిలిచారు.
49 సెంచరీ లతో సచిన్ టెండూల్కర్ ( Sachine Tendulkar ) పేరిట ఉన్న రికార్డ్ ( Record ) ను తన 50వ సెంచరీ తో అధిగమించారు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ ఈ ఘనత సాధించగలడని ముందే ఊహించారు మాస్టర్ బ్లాస్టర్ ( Master Blaster ) సచిన్ టెండూల్కర్.
2012 లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ( Salman Khan ) తో జరిగిన ఒక ప్రోగ్రాంలో సచిన్ మాట్లాడుతూ తన రికార్డ్ ను విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ( Rohit Sharma ) బ్రేక్ ( Break ) చేయగలరు అంటూ ముందుగానే ఊహించారు సచిన్.
కాగా విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డ్ ను బ్రేక్ చేయడం తో అప్పటి వీడియో సోషల్ మీడియా ( Social Media ) లో తెగ వైరల్ గా మారింది.