UP man gets wife married to her lover | ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో పెళ్లి చేయించాడు భర్త. వివరాల్లోకి వెళితే.. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో బబ్లూ, రాధికలకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది.
వారికి ఇద్దరు పిల్లలు. అయితే బబ్లూ తన ఉద్యోగ పనుల నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా గడపుతున్నాడు. ఈ క్రమంలో పిల్లలతో ఉంటున్న భార్య రాధిక అదే గ్రామంలో ఉన్న మరో వికాస్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
కొన్నాళ్లకు వీరిద్దరి విషయం రాధిక భర్త బబ్లూకు తెలిసిందే. అయితే భార్య వివాహేతర సంబంధాన్ని తప్పుపట్టకపోగా, రాధికకు, వికాస్ కు తానే దగ్గరుండి గ్రామ పెద్దల మధ్య వివాహం జరిపించాడు. అలాగే తన ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.