TS New Secretariate Inauguration | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయ భవనం (TS New Secretariate) దాదాపుగా పూర్తయ్యింది.
సీఎం కేసీఆర్ (CM KCR) అభిరుచులకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త సెక్రటేరియట్ ప్రారంభ తేదీ ఖరారు అయ్యింది.
కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి తన జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashant Reddy) తెలిపారు.
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar) పేరు పెట్టిన విషయం తెలిసిందే.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. 2019న జూన్ 27న సీఎం కొత్త సచివాలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు.
అయితే, ప్రతిపక్ష పార్టీలు మరియు వారసత్వ కట్టడాల ప్రేమికులు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌లను స్వీకరించిన హైకోర్టు (TS High Court) విచారణ అనంతరం కొట్టివేసింది. ఆ తర్వాత, 2020 చివరి నాటికి కరోనా సంక్షోభంలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
Read Also: పొరపాటు జరిగింది.. మన్నిస్తారని ఆశిస్తున్నా: బాలయ్య బాబు లేఖ!
కొత్త భవనంలోని అన్ని విభాగాల్లో దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి.
మిగిలిన 10 శాతం పనులు, గోపురాల నిర్మాణంతో పాటు కొన్ని బ్లాకుల నిర్మాణాలు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే, రోడ్లు మరియు భవనాల శాఖ సాధారణ పరిపాలనా విభాగానికి ప్రాంగణాన్ని అప్పగిస్తుంది.
ఇది ఇంటీరియర్ పనులను చేపట్టడానికి మంత్రులు, కార్యదర్శులు మరియు ఇతర కార్యాలయాలకు కేటాయించాల్సిన ఛాంబర్లను ఖరారు చేస్తుంది.
సచివాలయం ప్రత్యేకతలివే..
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని నిజాం సర్కార్ కట్టడాలను పోలిన నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఈ సముదాయంలో అన్ని ఆధునిక సౌకర్యాలు ఉండనున్నాయి.
దాదాపు 650 కోట్ల రూపాయలతో ఈ భవనాల సముదాయాన్ని నిర్మిస్తున్నారు.
మొత్తం 26.29 ఎకరాల్లో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. సచివాలయం ఎత్తు సుమారు 278 అడుగులు.
గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతోంది. రూఫ్ టాప్ లో ప్రత్యేక స్కై లాంజ్ ఉంటుంది.
అత్యాధునిక సౌకర్యాలు, పటిష్టమైన భద్రత, అందమైన పార్కులతో సుందరంగా నిర్మిస్తున్నారు.
భవనం ఏడో అంతస్తులో అత్యాధునిక హంగులతో సీఎం ఛాంబర్ ఉంటుంది. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక ద్వారం, స్పెషల్ లిఫ్ట్ ఉంటుంది. ఇక సందర్శకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఉంటుంది.
ప్రతి మంత్రి ఛాంబర్‌లో ఎనిమిది కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. అంటే సుమారు 200 కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర సిబ్బందికి కార్యాలయాలు ఉంటాయి.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఏడో అంతస్తులో ఉంటుంది. ఇది సెక్రటేరియట్‌లోని అత్యంత పై అంతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 30 కంపార్టుమెంట్లు ఉంటాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈ ట్రైన్ ప్రత్యేకతలు ఇవే!
కొత్త సెక్రటేరియట్ పార్కింగ్ స్థలంలో ఒకేసారి 300 కార్లు, 600 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు.
మొదటి అంతస్తులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ, రెండు, మూడవ అంతస్తులలో కన్వెన్షన్ సెంటర్లు మరియు రెస్టారెంట్లు ఉంటాయి.
ఈ సచివాలయ నిర్మా ణానికి రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ లేత గోధుమరంగు ఇసుకరాయిని ఉపయోగించారు.
సచివాలయం మధ్య భాగంలో ఆలయం తరహాలో ఐదు గోపురాలు ఉన్నాయి. ఈ సచివాలయం దాదాపు 100 ఏళ్ల పాటు ఉండేలా పకడ్బంధీగా నిర్మించారు.
ప్రస్తుతం బిర్లా మందిర్ (Birla Mandir) వైపు రోడ్డుపై ఉన్న పెట్రోల్ బంకును తొలగించి విజిటర్స్ కోసం మరో గేటు నిర్మిస్తున్నారు.
మూడు గేట్లు ఉండకూడదనే ఉద్దేశంతో సచివాలయం వెనుక భాగంలో మరో గేటు కూడా వేస్తున్నా రు. అయితే దీనిని ఇది అత్య వసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తారు.