Trump says ‘we’ve lost India, Russia to darkest China’ | భారత్ ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.
చైనా లో జరిగిన షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్న విషయం తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా మోదీ, పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఈ ముగ్గురు నేతలు కలిసున్న ఫోటోను షేర్ చేసిన ట్రంప్ ‘భారత్, రష్యా లను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తుంది. ఈ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నట్లు’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
భారత్, రష్యాలు చైనాకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ దేశాలు అమెరికాకు దూరం అవుతున్నట్లే అనే అర్థం వచ్చేలా ట్రంప్ పోస్ట్ చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ట్రంప్ సుంకాలతో రెచ్చిపోతున్న తరుణంలో భారత్, రష్యా మరియు చైనా ఒకే వేదికపైకి రావడం అమెరికాను కలవరపెడుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.









