Monday 12th January 2026
12:07:03 PM
Home > తాజా > అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్తారా?

అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్తారా?

tgsrtc

‌- కార్తీక పౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీ!

TGSRTC Arunachalam Tour Package | కార్తీక మాసం సందర్భంగా తెలంగాణలోని శివ భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఓ శుభవార్త చెప్పింది. కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా తమిళనాడులోని అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ టూర్ ప్యాకేజీని (TGSRTC Arunachalam Tour Package ) ప్ర‌క‌టించింది.

ఈ ప్యాకేజీలో కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క‌స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించే సౌక‌ర్యాన్ని సంస్థ క‌ల్పిస్తోంది. హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్ల‌గొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది.

ఈ నెల 15న కార్తీక పౌర్ణ‌మి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం త‌ర్వాత కార్తీక  పౌర్ణ‌మి పర్వ‌దినం నాడు అరుణాచ‌లానికి చేరుకుంటాయి.

అరుణాచ‌ల గిరి ప్ర‌దక్షిణతోపాటు పంచారామాలకు కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. భక్తులు tgsrtc వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్రదించవచ్చు.

https://x.com/tgsrtcmdoffice/status/1854074105785709042

You may also like
tgsrtc green metro
మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కీలక నిర్ణయం!
drunken drive test
బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఒక్కటే ప్రామాణికం కాదు: తెలంగాణ హైకోర్టు!  
tgsrtc
తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!
tgsrtc
నిజాయతీ చాటుకున్న కండక్టర్ కు సన్మానం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions