TGSRTC All Time Record On Rakhi Pournami | రాఖీపౌర్ణమి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ( TGSRTC ) ఆల్ టైం రికార్డ్ ( All Time Record )సృష్టించింది.
రికార్డు స్థాయిలో 63 లక్షల మంది వరకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన సంస్థ సిబ్బంది, అధికారులను RTC ఎండీ వీసీ సజ్జనర్ ( MD Vc Sajjanar )అభినందించారు. ఈ ఒక్కరోజే ఏకంగా 41 లక్షల 74 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
రక్షాబంధన్ నాడు ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయని సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగినట్లు సజ్జనర్ ప్రకటించారు.
రాఖీ నాడు రికార్డు స్థాయిలో రూ. 32 కోట్ల వరకు రాబడి వచ్చిందిని అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని, ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలోని 97 డిపోల( Depot )కు గాను 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో ( Occupancy Ratio )ను నమోదు చేశాయని ఆనందం వ్యక్తం చేశారు.