Sunday 4th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మాచెర్లలో ఈవీఎం ధ్వంసం.. వైసీపీ పై టీడీపీ ఫైర్!

మాచెర్లలో ఈవీఎం ధ్వంసం.. వైసీపీ పై టీడీపీ ఫైర్!

tdp ycp

EVMs Destructions | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) సమయంలో మాచెర్ల (Macherla) నియోజకవర్గంలోని పాల్వా గేట్ (Palwa Gate) పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం మెషీన్ (EVM Machine) ధ్వంసం చేసిన వీడియో మంగళవారం బయటకు రావడం పెను కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వైసీపీ పై నిప్పులు చేరిగింది టీడీపీ. ” ప్రజలు తమకు ఓట్లు వేయటం లేదని, జగన్ చేయని పాపం లేదు.

పోలింగ్ జరిగిన రోజు, మాచర్ల నియోజకవర్గంలోని పాల్వా గేట్ పోలింగ్ కేంద్రంలో(202), ఏకంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సిసి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

ఒక పక్క ఈవీఎంల ధ్వంసం, మరో పక్క మారణహోమం చేసి, ఏమి తెలియనట్టు జగన్ రెడ్డి దేశం దాటి పోతే, ఈ పిల్ల సైకోలు రాష్ట్రం దాటి పారిపోయారు.‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ప్రతి ఒక్కరూ జూన్ 4 తరువాత చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు.” అని టీడీపీ హెచ్చరించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

You may also like
‘స్కూటీ దొంగిలించిన ఎద్దు’
‘ఇదేం పైత్యం..చనిపోయిన పోప్ అవతారంలో ట్రంప్’
‘వరకట్నం వద్దేవద్దు..రూ.31 లక్షలని తిరిగిచ్చేసిన వరుడు’
‘అవ్‌నీత్ కౌర్ ఫొటోకు లైక్..క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions