Delivery Boy Steals Costumer Laptop | హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన డెలివరీ యాప్స్ (Delivery Apps) పై అనుమానాలను రేకెత్తిస్తోంది. పార్సల్ ను డెలివరీ (Parcel Delivery) చేయాల్సిన డెలివరీ బాయే దొంగగా మారాడు.
వివరాల్లోకి వెళ్తే, తన భర్త నుండి డెలివరీ చేయాల్సిన ల్యాప్ టాప్ ను స్విగ్గి డెలివరీ బాయ్ దొంగిలించినట్లు, అది తిరిగిఇవ్వాలంటే రూ.15 వేలు డిమాండ్ చేసినట్లు నిషితా గుడిపూడి అనే మహిళ తెలిపారు. ఈ మేరకు లింక్డిన్ (LinkedIn)లో పోస్ట్ చేశారు.
ఒక ఆఫీసు నుండి మాదాపూర్ లోని మరో ఆఫీస్ కు ల్యాప్ టాప్ పంపించేందుకు పార్సెల్ డెలివరీ యాప్ స్విగ్గి జెనీ రైడ్ ను బుక్ చేసాడు. బ్యాక్ ప్యాక్ లో ల్యాప్ టాప్ ను తీసుకున్న డెలివరీ బాయ్ అనంతరం తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసాడు.
ఎంత సమయం గడిచిన సమాధానం లేకపోవడంతో స్విగ్గి కస్టమర్ కేర్ ను సంప్రదించాడు సదరు వ్యక్తి. అయితే వారు కూడా డెలివరీ బాయ్ ను గుర్తించలేకపోయారు. ల్యాప్ టాప్ కావాలంటే రూ. 15000 ఇవ్వాలని ఆ డెలివరీ బాయ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లు బాధితులు రాసుకొచ్చారు. ఇక చేసేదేం లేక వారు డెలివరీ బాయ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.