Supreme Court on Kolkata Incedent | కోల్‌కతా వైద్యురాలి (Kolkata Doctor Incident) హత్యాచార ఘటనపై భారత సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన అపెక్స్ కోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులతో పాటు ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. ఆసుపత్రిలో అంత ఘోరం జరిగితే.. వైద్యురాలు ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారంటూ మాజీ ప్రిన్సిపాల్ పై మండిపడింది.
ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సక్రమంగా లేదని, ఎఫ్‌ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పని ప్రదేశంలో మహిళలకు పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయస్థాయి ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరం’ అని ధర్మాసనం వెల్లడించింది.
ఇందుకోసం జాతీయ టాస్క్ ఫోర్స్‌ను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. హత్యాచారానికి గురైన డాక్టర్‌కు మద్దతుగా దీదీ ర్యాలీ టాస్క్‌ఫోర్స్ లో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇనిస్టి్ట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, సర్జన్ వైస్ అడ్మిరల్ ఆరే సరిన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ మార్పుల విషయంలో మరో అత్యాచారం కోసం దేశం ఎదురుచూడబోదని వ్యాఖ్యానించింది.