Friday 17th April 2026
12:07:03 PM
Home > తాజా > ఆర్టీసీ టికెట్ రేట్లు..సజ్జనర్ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ టికెట్ రేట్లు..సజ్జనర్ కీలక వ్యాఖ్యలు

RTC MD Sajjanar Clarity On Ticket Rates | దసరా ( Dasara ) పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ( TGSRTC ) బస్సుల్లో ఛార్జీలు భారీగా పెంచారనే ప్రచారంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ( MD Sajjanar ) స్పందించారు.

జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదని స్పష్టం చేశారు. జీవో ప్ర‌కారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్ర‌మే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందని రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. అలాగే పండ‌గ స‌మ‌యాల్లో మాత్ర‌మే జీవో ప్ర‌కారం స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది.

సాధార‌ణ రోజుల్లో య‌థావిధిగా సాధారణ టికెట్ ధ‌ర‌లే ఉంటాయని స్పెష‌ల్ స‌ర్వీసుల‌కు టికెట్ ధ‌ర‌లను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోందని సజ్జనర్ చెప్పారు.

ప్రధాన పండుగల సమయంలో రద్దీ మేరకు హైద‌రాబాద్ సిటీ బ‌స్సుల‌ను కూడా జిల్లాల‌కు సంస్థ తిప్పుతుందని, తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌క‌పోవ‌డంతో ఖాళీగా ఆ బ‌స్సులు వెళ్తుంటాయి, ఆ స్పెష‌ల్ బ‌స్సుల‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌ను స‌వ‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిందని సజ్జనర్ గుర్తుచేశారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
tgsrtc
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం..ప్రభుత్వం క్లారిటీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions