Thursday 8th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ ముంబైతోనే ఉంటాడా ?..మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

రోహిత్ ముంబైతోనే ఉంటాడా ?..మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

 Rohit Sharma might leave Mumbai Indians | ఐపీఎల్ 2025 ( IPL 2025 ) మెగా ఆక్షన్ ( Mega Auction )దగ్గర పడుతున్న తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ( Hitman Rohit Sharma ) ముంబై ఇండియన్స్ ( Mumbai Indians )తోనే ఉంటాడా ? ముంబై రోహిత్ ని అంటిపెట్టుకుంటుందా ? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి.

ఐపీఎల్ 2024 సందర్భంగా రోహిత్ శర్మను పక్కన పెట్టి యాజమాన్యం హార్దిక్ పాండ్య ( Hardik Pandya )కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) కీలక విశ్లేషణ చేశారు.

ముంబై తో రోహిత్ ప్రయాణం ఇక ముగిసినట్లే అని తాను భావిస్తున్నట్లు ఆకాష్ చోప్రా తెలిపారు. ముంబై టీంతో కొనసాగడం రోహిత్ కు ఇష్టం లేదని, అలాగే వేలంలో రోహిత్ ను ముంబై వదులుకునే అవకాశం ఉందన్నారు.

ఆక్షన్ లోకి వస్తే రోహిత్ ను కొనేందుకు ఇతర టీంలు పోటీ పడతాయని పేర్కొన్నారు. మరోవైపు సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav )ను మాత్రం ముంబై వదులుకునే ప్రసక్తే లేదని అంచనా వేశారు.

You may also like
‘BCCI సెంట్రల్ కాంట్రాక్ట్.. వారికి రూ.7 కోట్ల వేతనం’
ఛాంపియన్స్ ట్రోఫీ..పాకిస్థాన్ కు భారీ నష్టం
rohit sharma
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలికామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ!
టీం ఇండియా జెర్సీపై పాకిస్తాన్ పేరు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions