Wednesday 4th December 2024
12:07:03 PM
Home > తాజా > Pushpa 2 Tickets: సుబ్బారావు ఇడ్లీల కథ చెప్పిన ఆర్జీవీ!

Pushpa 2 Tickets: సుబ్బారావు ఇడ్లీల కథ చెప్పిన ఆర్జీవీ!

rgv

Pushpa 2 Ticket Price | అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబో లో చిత్రీకరించిన పుష్ప 2 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 మేనియా ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లపై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

రూ.1200 ధర పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరు. ఇదిలా ఉండగా పుష్ప 2 టికెట్ రేట్లపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. సుబ్బారావు ఇడ్లీలు అంటూ ఓ కథ అల్లు కొచ్చారు.

“పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2. సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి  ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.

కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు  సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు. “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత  వెర్రితనం.

ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్  మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్  లాగే  సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.

అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు  సినిమా టికెట్ ధరల మీదే  ఎందుకు ఏడుస్తున్నారు? ఎంటర్టైన్మెంట్  నిత్యావసరమా? ఇల్లు, తిండి, బట్టలు ఈ  మూడింటి  కన్నా ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.

అలా అనుకొని  వారు  చూడటం  మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా? మళ్లీ సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా  కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి! అని పరోక్షంగా పుష్ప టికెట్ రేట్లను సమర్థించారు ఆర్జీవీ.

You may also like
పుష్ప-2 రిలీజ్..మెగా ఫ్యాన్స్ కు నాగబాబు విన్నపం
cm revanth reddy
వాళ్ల ముందు మాట్లాడటానికి భయపడ్డా: సీఎం
av ranganath
హైడ్రా మరో కీలక నిర్ణయం..ఇక నుంచి ప్రతి సోమవారం..
కలకలం..మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions