Buy Villa Get Lamborghini Car | ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా (Noida)కు చెందిన ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ (JayPee Greens) ఓ బంపరాఫర్ ప్రకటించింది.
తమ వెంచర్లలో లగ్జరీ విల్లా కొన్నవారికి ఏకంగా లాంబోర్గిని ఉరుస్ (Lamborghini Urus) కారును గిఫ్ట్ గా ఇస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తన ప్రాజెక్టుల్లో రూ.26 కోట్ల విలువైన అల్ట్రా-ప్రీమియం విల్లాలను కొనుగోలు చేసే వారికి లాంబోర్గిని ఉరుస్ కారును ఫ్రీగా ఇస్తామని పేర్కొంది. దీంతోపాటు ఈ విల్లాల్లో ఉండే వారికి పలు విలాసవంతమైన సౌకర్యాలను కూడా కల్పించనున్నట్లు వెల్లడించింది.
పార్కింగ్, స్విమ్మింగ్ ఫూల్, థియేటర్, క్లబ్ మెంబర్‌షిప్, గోల్ఫ్ కోర్స్ కోసం ఈ రూ.26 కోట్లకు అదనంగా మరో రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని జేపీ గ్రీన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుందని తెలిపింది.
తమ వద్ద విల్లాలు రూ.51 లక్షల నుంచి రూ.30 కోట్ల వరకు ఉన్నట్లు వివరించింది. గౌరవ్ గుప్తా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ ఆఫర్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.