Ram Charan In Australia | గ్లోబల్ స్టార్ రాం చరణ్ ( Ram Charan ) ఆస్ట్రేలియా ( Australia ) లో పర్యటిస్తున్నారు. అక్కడ మెల్బోర్న్ ( Melbourne ) వేదికగా జరుగుతున్న ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ కు స్పెషల్ గెస్ట్ ( Guest Of Honour ) గా రాం చరణ్ హాజరయ్యారు.
ఇండియన్ సినిమాకు చేసిన కృషికి గాను రాం చరణ్ ‘ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్’ గా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి సందడి చేశారు. వారితో ముచ్చటించి, సెల్ఫీలు దిగారు.
ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన రాం చరణ్ ‘ఆరెంజ్’ ( Orange ) మూవీ రోజులను గుర్తుచేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం తన మూడవ సినిమా ‘ఆరెంజ్’ షూటింగ్ కోసం మెల్బోర్న్ వచ్చినట్లు గుర్తుచేసుకున్నారు.
సుమారు 30 రోజుల పాటు షూటింగ్ ( Shooting ) జరగగా అభిమానులు తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నట్లు చెప్పారు. షూటింగ్ పూర్తయి ఇండియా వెళ్లే సమయంలో భావోద్వేగానికి గురయినట్లు తెలిపారు.
అప్పటికంటే ఇప్పుడు భారతీయులు ఎక్కువ మంది కనిపిస్తున్నారన్నారు. భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.