PM Modi explains why he arrived late for ‘Global Investors Summit 2025’ in Bhopal | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ సోమవారం హాజరయ్యారు.
అయితే సమ్మిట్ కు ఆలస్యంగా రావడం పట్ల ప్రధాని క్షమాపణలు కోరడం ఆసక్తిగా మారింది. ఆలస్యానికి గల కారణం కూడా వివరించారు.
సోమవారం 10,12 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయి, పరీక్ష ప్రారంభం అయ్యే సమయం తాను బయలుదేరే సమయం ఒక్కటేనని చెప్పిన ప్రధాని రాజ్ భవన్ నుండి తాను బయలుదేరితే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తుచేశారు.
ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయితే విద్యార్థులు ఇబ్బందులు పడతారని, అందుకే తాను విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్ళాక బయలుదేరినట్లు చెప్పారు. దింతో 10-15 నిమిషాల పాటు ఆలస్యం అయ్యిందన్నారు. ఈ క్రమంలో సమ్మిట్ లో పాల్గొన్న వారికి అసౌకర్యం కలిగించినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు కోరారు.