Pawan Kalyan offers Rs.2 lakh financial support to actress Vasuki | సినీ నటి వాసుకికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం చేశారు.
తాను ధీనస్థితిలో ఉన్నానని, ఆర్ధిక సహాయం చేయాలని ఇటీవలే పాకీజా కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆమె దీన స్థితి తెలిసుకున్న ఆయన రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి సోమవారమే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు.