Monday 4th May 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > “Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన

“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన

Operation Keller News | జమ్మూకశ్మీర్ లో కరుడుగట్టిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. మంగళవారం ఉదయం జమ్మూ షోపియన్ లోని కెల్లర్ ప్రాంతంలో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యానికి సమాచారం వచ్చింది.

వెంటనే సైన్యం సెర్చ్ ఆండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ మేరకు సైన్యం ఒక ప్రకటన చేసింది. ఆపరేషన్ కెల్లర్ లో భాగంగా ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించినట్లు సైన్యం స్పష్టం చేసింది.

ఆపరేషన్ సందర్భంగా ఉగ్రవాదులు, సైనికులపైకి కాల్పులు జరిపారని పేర్కొంది. సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతమయ్యారు. అయితే ఆపరేషన్ కెల్లర్ ఇంకా కొనసాగుతుందని సైన్యం స్పష్టం చేసింది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions