Tuesday 17th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నపోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం!

రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకున్నపోలీసులు.. అరెస్టుకు రంగం సిద్ధం!

Police at RGV home | వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి ఏపీలోని ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీ సోమవారం ఒంగోలు రూరల్ పీఎస్ విచారణకు వెళ్లాల్సి ఉంది. అయితే హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గత సాధారణ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ అనే సినిమా ప్రమోషన్ లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ నాయకుడు రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలంటూ రాంగోపాల్ వర్మ అదేరోజు వాట్సప్ లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు.

You may also like
భార్య చివరి కోరిక తీర్చేందుకు వచ్చి.. విమాన ప్రమాదంలో కన్నీటి గాథలు!
tgsrtc
తెలంగాణ ఆర్టీసీ ఎన్ని కోట్ల ఉచిత టికెట్లు ఇచ్చిందో తెలుసా!
adluri laxman kumar
ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి!
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions