Actor Ali response on Notice | వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని సినీ నటుడు అలీ ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ గ్రామ కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. తాజాగా అలీ తనకు వచ్చిన నోటీసులపై స్పందించారు. ఎక్మామిడిలో ఓ కన్వెన్షన్ సెంటర్ కోసం తన స్థలం లీజుకు ఇచ్చినట్లు అలీ వెల్లడించారు. నిర్మాణాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని వివరణ ఇచ్చారు. అందుకే ఆ నిర్మాణాలపై లీజుదారులే సమాధానం ఇస్తారని తెలిపారు.