Nagarjuna announces re-release date of Shiva | శివ 1989లో వచ్చిన ఈ సినిమా కేవలం తెలుగు సినీ పరిశ్రమనే కాదు దేశ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. అందులోని చేసింగ్ సీన్లు, ఫైట్లు మరీ ముఖ్యంగా సైకిల్ చైన్ సీన్ అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.
రాంగోపాల్ వర్మ ఈ సినిమా ద్వారానే అరంగేట్రం చేయగా, నాగార్జున రేంజ్ ను అమాంతం పెంచేసిన సినిమా ఇది. ఇండియన్ సినిమా అంటే శివకు ముందు ఆ తర్వాత అని కొందరు ఇప్పటికీ విశ్లేషణలు చేస్తుంటారు. కాగా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన శివ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈసారి 4K, డాల్బీ అట్మాస్ సౌండ్ తదితర హంగులతో ప్రేక్షకులను అలరించనుంది.
తెలుగు సినిమా దిగ్గజ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా శివ మూవీని నవంబర్ 14న రీరిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు నాగార్జున. ఇండియన్ సినిమానే షేక్ చేసిన మూవీ తిరిగి రాబోతున్నట్లు చెప్పారు నగార్జున.









