Friday 23rd May 2025
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavita who visited KCR

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) కాలుజారి పడటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. తుంటి ఎముక మార్పిడి చేయాలని, కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని చెప్పారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.
కాగా, దవాఖానలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం వల్ల పెద్ద శస్త్ర చికిత్స జరుగనుంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులతోపాటు తాము కూడా ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ చేశారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions