Wednesday 23rd April 2025
12:07:03 PM
Home > తెలంగాణ > ఆ సినిమా చూసే ఎంపీ అయిన.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆ సినిమా చూసే ఎంపీ అయిన.. మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

minister malla reddy

Minister Mallareddy Comments | ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో రణబీర్ కపూర్ (Ranbeer Kapoor), రష్మిక (Rashmika Mandanna) జంటగా నటించిన చిత్రం యానిమాల్ (Animal).

డిసెంబర్ 1న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్ లో మల్లారెడ్డి యూనివర్సిటీ (Mallareddy University) లో ప్రీ రిలీజ్ ఈవెంట్ (Animal Prerelease Event)ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కు మంత్రి మల్లారెడ్డి, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), రాజమౌళి (Rajamauli), దిల్ రాజు (Dil Raju) తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ (Business Man) సినిమా చూసే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు మల్లారెడ్డి.

అలాగే ఆ సినిమా పది సార్లు చూసి ఎంపీ అయ్యాననన్నారు. సేమ్ అదే సిస్టం, అదే మోడల్ ప్రకారం ఎంపీ అయినట్లు మహేష్ బాబుకు చెప్పారు మల్లారెడ్డి.

మరో 5 ఏండ్లలో తెలుగు సినిమా బాలీవుడ్ (Bollywood), హాలీవుడ్ (Hollywood)ను ఏలుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అప్పుడు రాజమౌళి, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తమ సినిమాలతో బాలీవుడ్ ను షేక్ చేస్తారని పేర్కొన్నారు. తెలుగు ప్రజాలు చాలా స్మార్ట్ అని స్పష్టం చేశారు.

You may also like
ssmb 29
SSMB29 సినిమాపై క్రేజీ న్యూస్.. మహేశ్ ను ఢీకొట్టే విలన్ ఈమేనట!
ఒకే ఫ్రేమ్ లో చిరు, నాగార్జున, మహేష్, చరణ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions