SSMB29 Villain |సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamauli) కాంబో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వార్తలు వస్తున్నాయి. సినిమా కోసం రాజమౌళి మహేశ్ పాస్ పోర్ట్ కూడా హ్యాండోవర్ చేసుకున్నట్లు ఓ ఫొటో వైరల్ అయింది.
ఇటీవల ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, పృథ్వీరాజ్ స్వయంగా ఈ వాదనలను ఖండించారు. వాటిని కేవలం పుకార్లుగా తోసిపుచ్చారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేశ్ సరసన హీరోయిన్ కాదనీ, ప్రధాన విలన్‌గా నటిస్తున్నారని ఫిలిం సర్కిళ్లలో వార్త చక్కర్లు కొడుతోంది.
ఆమె పాత్ర కోసం ఇప్పటికే లుక్ టెస్ట్ పూర్తి చేసిందని, ఇది సినిమా చుట్టూ ఉన్న ఆసక్తిని మరింత పెంచిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజమౌళి మరో బాలీవుడ్ (Bollywood) నటిని హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం, అయితే వీటిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.