Sai Pallavi In Fauji | టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవఫూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫౌజీ. 1970 నాటి యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో సైనికుడిగా కనిపిస్తున్న ప్రభాస్ సరసన ఇమాన్వీ (Imanvi) నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 5నుంచే కొత్త షెడ్యూల్ మొదలవుతోంది. అయితే తాజాగా ఫౌజీకి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందట. అందులో ప్రభాస్ యోధుడిగా కనిపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో ప్రభాస్ ప్రేయసిగా సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం. త్వరలో సాయి పల్లవి పాత్రపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.