Game Changer OTT Release | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). జీ స్టూడియోస్ (Zee Studios) బ్యానర్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
సమకాలీన రాజకీయాలు నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 10న ఎన్నో అంచనాల మధ్య థియేటర్ లో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫిస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.
అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 7న గేమ్ ఛేంజర్ సినిమా అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది.