Melbourne Mayor Selfie With Ram Charan | గ్లోబల్ స్టార్ రాంచరణ్ ( Ram Charan )ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ( Melbourne ) నగరంలో పర్యటించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ‘ ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ‘ కు గౌరవ అతిథిగా రాంచరణ్ హాజరయ్యారు.
అక్కడ అభిమానులతో కలిసి సందడి చేసిన చరణ్ జ్ వారితో సెల్ఫీ ( Selfie )లు దిగారు. ఈ నేపథ్యంలో స్పందించిన మెల్బోర్న్ మేయర్ నిక్ రీస్ ( Mayor Nick Reece ) రాం చరణ్ తో సెల్ఫీ దిగడంతో తన కల నెరవేరిందన్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ( Social Media ) వేదికగా పంచుకున్నారు. తాను కూడా రాంచరణ్ కు అభిమానిని అని వెల్లడించారు.
మెల్బోర్న్ నగరాన్ని అందంగా తీర్చిదిద్దడంలో ఇక్కడి భారతీయుల పాత్ర కీలకం అని కొనియాడారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి రోషేనా తో కలిసి ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ ( Independence Day )వేడుకల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా రాం చరణ్ తో సెల్ఫీ దిగడంతో తన విష్ లిస్ట్ ( Bucket List )లో ఒకటి నెరవేరినట్లు మేయర్ నిక్ రీస్ పేర్కొన్నారు.