- మేధాజెన్ ఏఐ – క్యూ2బిట్స్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ
హైదరాబాద్: క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్-ఏఐ రీసెర్చ్, విద్యా రంగం, నూతన ఆవిష్కరణల సమ్మేళనంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఒక కీలక ముందడుగు పడింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హెల్త్ కేర్ అప్లికేషన్లపై పరిశోధనలు చేస్తున్న ప్రముఖ సంస్థ ‘మేధాజెన్ ఏఐ’ (MedhaGen AI), క్వాంటమ్ టెక్నాలజీస్ రంగంలోని ‘క్యూ2బిట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్’ (Qu2Bits Quantum Computing) సంస్థల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో ఇరు సంస్థల ప్రతినిధులు ఈ ఎంవోయూ పై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం మేరకు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన, క్వాంటమ్ ఏఐ, క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ అల్గారిథమ్స్ & ఆప్టిమైజేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) అంశాలలో ఈ రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి.
హెల్త్‌కేర్ సవాళ్లకు పరిష్కారం..
వైద్య రంగానికి సంబంధించిన సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడానికి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్-ఏఐ సాంకేతికతలను ఉపయోగించనున్నారు. ఈ ప్రక్రియ చట్టబద్ధమైన, నైతిక, డేటా రక్షణ నియమాలకు లోబడి ఉంటుంది.
సాంకేతిక నిపుణుల మధ్య జ్ఞాన మార్పిడి (Knowledge exchange), వర్క్ షాప్‌లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ల ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, ప్రొఫెషనల్స్ కు విస్తృత అవకాశాలు కల్పిస్తారు. భవిష్యత్తులో జాయింట్ రీసెర్చ్ ప్రపోజల్స్, ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ (PoC) ప్రాజెక్టులు, టెక్నాలజీ డెమోస్ట్రేషన్స్ నిర్వహించనున్నారు.

భవిష్యత్తు సాంకేతిక పురోగతి దిశగా..
సంక్లిష్టమైన గణనపరమైన సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ల కలయిక అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రెండు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైద్య పరిశోధనలు, క్లినికల్ నిర్ణయాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్లలో ఈ సాంకేతికతలు సరికొత్త మైలురాళ్లను అధిగమించనున్నాయి.










